విలక్షణ పాత్రలో

విభిన్నమైన పాత్రలతో అలరిస్తున్న నటుడు జగపతిబాబు త్వరలో మరో విలక్షణ పాత్రలో కనిపించబోతున్నాడు. పారిశ్రామిక వేత్త, పార్లమెంట్‌ సభ్యుడు గల్లా జయదేవ్‌ తనయుడు అశోక్‌ గల్లా హీరోగా రూపొందుతున్న ఓ చిత్రంలో జగపతిబాబు కీలకపాత్రను పోషిస్తున్నారు. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో అమర్‌రాజా మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో జగపతిబాబు పాత్ర కొత్త పంథాలో సాగుతుందని చిత్ర బృందం తెలిపింది. ఇటీవల తొలిషెడ్యూల్‌ పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలోనే రెండో షెడ్యూల్‌కు సిద్ధమైంది. జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: రిచర్డ్‌ ప్రసాద్‌, సహనిర్మాత: చంద్రశేఖర్‌ రావిపాటి.